హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు... పలువురి అరెస్ట్, సెంటర్ల సీజ్
హైదరాబాదులో హుక్కా సెంటర్ల కల్చర్ క్రమంగా విస్తరిస్తోంది. మొన్నటిదాకా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలకే పరిమితమైన హుక్కా సెంటర్లు తాజాగా పంజాగుట్టలాంటి రద్దీ ప్రాంతాలకూ విస్తరించాయి. నిన్న రాత్రి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలతో పాటు పంజాగుట్టలోనూ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండానే నడుస్తున్న పలు హుక్కా సెంటర్లు పోలీసుల కంటబడ్డాయి. వీటిలో తనిఖీలు చేసిన పోలీసులు పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు.